పెద్దిరెడ్డి కుటుంబంపై ప్రభుత్వ కుట్ర
ఉరవకొండ: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై ప్రజాదరణను ఓర్వలేక కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. పెద్దిరెడ్డి కుటుంబానికి భూముల కబ్జాలు, అక్రమాలకు పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. వారి కుటుంబం నిత్యం ప్రజా సేవ చేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. పెద్దిరెడ్డి కుటుంబ ఎదుగుదల, ప్రజల్లో వారికి ఉన్న ప్రేమ, ఆప్యాయతలు చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం, పచ్చ మీడియా అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు పథకం ప్రకారమే పెద్దిరెడ్డిపై గోబెల్స్ ప్రచారానికి తెరతీశారన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయక వైఫల్యం చెందడంతో ప్రజల దృష్టిని మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం కొనుగోలు చేసింది అటవీ భూమి కాదని కేంద్రం గెజిట్‌లో కూడా స్పష్టంగా చెప్పిందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు అండ్ కో ఇచ్చిన హామీలు అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హితవు పలికారు.
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే బడ్జెట్..
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించిందని విశ్వ తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే బడ్జెట్ సారాంశంగా ఉందని విమర్శించారు. తాగు, సాగునీటి ప్రాజెక్టులకు ఆశించిన స్ధాయిలో కేటాయింపులు లేవన్నారు. గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం అంటూ అంకెల గారడీ చేశారన్నారు. రాష్ట్రానికి నిధులు సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లు ఘోరంగా విఫలమయ్యారని తెలిపారు.
డైవర్షన్ పాలిటిక్స్‌లో చంద్రబాబు దిట్ట
మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment