ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎం చంద్రబాబను ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్‌కుమార్ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలంటూ ఆదివారం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ మాట్లాడారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. తొలి సంతకం చేసిన మెగా డీఎస్‌సీకి సంబంధించి ఇప్పటి వరకూ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. నిరుద్యోగభృతి ఊసే లేదన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తికి నోటిఫికేషన్ ప్రస్తావన కూడా చేయడం లేదన్నారు. నిరుద్యోగులకు 20 లక్షలు ఉద్యోగాలు ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సమగ్ర యువజన విధానం అమలు చేయాలన్నారు. నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి భగత్‌సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ కింద యువతకు ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పించాలన్నారు. వీటన్నిటిపై ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు శ్రీకాకుళంలో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందించి పోరాటాలు సాగిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్, శ్రీనివాసులు, మన్సూర్, సాదిక్, వలి, ధనుంజయ, మాబాషా, నబీరసూల్, గణేష్, ముజీర్, తదితరులు పాల్గొన్నారు.
ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్
Comments
Please login to add a commentAdd a comment