● అధికారులకు టీడీపీ
మండల కన్వీనర్ హుకుం
కళ్యాణదుర్గం: బ్రహ్మసముద్రం మండలంలోని పాలవెంకటాపురం గ్రామంలో చర్మ కారుల పింఛన్ల మొత్తాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ పంపిణీ చేయరాదంటూ సచివాలయ సిబ్బందిని టీడీపీ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు ఆదేశించారు. రెండు రోజుల ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అంశానికి సంబంధించి వివరాలు... ఈ నెల పింఛను అందించేందుకు గ్రామానికి వచ్చిన సచివాలయ సిబ్బందిని శ్రీరాములు కలసి ఎవరెవరకి పింఛన్లు వచ్చాయంటూ ఆరా తీశారు. గ్రామానికి చెందిన దళితులు లింగప్ప, ధనుంజయ, శివన్నకు పింఛన్ జారీ అయినట్లు తెలుసుకున్న ఆయన వెంటనే వారికి ఆ మొత్తాన్ని ఇవ్వకూడదంటూ సచివాలయ సిబ్బందికి సూచించారు. తన మాట వినకపోతే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. పింఛన్‌దారులు వెళ్లి కలిసేత శ్రీరాములును కలసి మాట్లాడాలని సచివాలయ సిబ్బంది తెలపడంతో లబ్ధిదారులు వెంటనే ఇన్‌ఛార్జ్ ఎంపీడీఓ నందకిషక్షర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే తాను ఎమ్మెల్యే మీటింగ్‌లో ఉన్నానని వచ్చిన తర్వాత మాట్లాడుతానని ఆయన సమాధానమివ్వడంతో బాధితులు వెనుదిరిగారు. కేవలం దురుద్దేశంతోనే తమకు పింఛన్లు అందకుండా చేస్తున్నారని ఈ సందర్భంగా దళితులు ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యం దుకాణాల నిర్వహణకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం: కల్లు గీత కార్మికులకు ప్రభుత్వం కేటాయించిన మద్యం దుకాణాలకు ఈ నెల 5వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య తెలిపారు. రిజర్వేషన్ మేరకు మద్యం దుకాణాలు కేటాయింపుపై అనుమానాలు నివృత్తి చేయడానికి ఆదివారం తన చాంబర్లో కల్లుగీత కులాల ప్రతినిధులతో ఆయన సమావేశమై మాట్లాడారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment