సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ఈ నెల 9న విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం చేరుకుంటారు. వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రతినిధుల సభలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
ఈ సభకు రాష్ట్ర నలమూలల నుంచి పార్టీ శ్రేణులు భారీగా హాజరుకానున్నారు. మొత్తం 8,222 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ కో ఆర్డినేటర్లు, సమన్వయకర్తలు, మున్సిపల్ ఛైర్మన్లు, మార్కెట్ యార్డు ఛైర్మన్లు, ఎంపీపీలు సహా పలువురు ప్రతినిధులు హాజరవ్వనున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికలకు క్యాడర్‌ను సమాయత్తం చేయనున్నారు. రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనునున్నారు.
చదవండి: బ్రెయిన్ డెడ్ పార్టీకి సానుభూతి వైద్యం
Comments
Please login to add a commentAdd a comment