నీటి విడుదల సందర్భంగా పూజలు చేస్తున్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట చెరువుకు మళ్లీ సోమశిళ వెనుకజలాలు వచ్చాయి. చెరువులోకి బ్యాక్‌వాటర్‌ను ఎమ్మెల్యే మేడామల్లికార్జునరెడ్డి ఆదివారం విడుదల చేశారు. కుడమలూరు వద్ద పంప్ హౌస్ నుంచి నీరు విడుదల చేశారు.అంతకుముందు పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకొని సంబంధిత పంప్‌హౌకు రూ.50లక్షల మంజూరు చేశారన్నారు. నీటి విడుదల విషయం కలెక్టర్ తీసుకెళ్లినట్లు చెప్పారు. తాను సీఎంను కలిసి ఒంటిమిట్ట చెరువు ఎండిపోతోందని, మళ్లీ నీటిని విడుదల చేయాలని కోరామన్నారు. రెండు పైప్‌లైన్ కోసం ప్రతిపాదనలు పంపంచామన్నారు. మంజూరైన వెంటనే పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ డైరెక్డర్ ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, ఒంటిమిట్ట మండల కన్వీనర్ గజ్జల శ్రీనివాసులరెడ్డి, ఒంటిమిట్ట చెరువు కమిటీ చైర్మన్ ఆకేపాటి శివారెడ్డి, పెన్నపేరూరు ఎంపీటీసీ ముమ్మడి నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment