డీఎస్పీ ఔట్..ఏఎీస్పీ ఇన్ !
ఐపీఎస్ అధికారి మనోజ్‌రామనాథ్‌హేగ్డే నియమాకం
రాజంపేట : ఇప్పటి వరకు రాజంపేట సబ్‌డివిజన్‌కు ఎస్‌డీపీఓ(డీఎస్పీ) క్యాడర్ కొనసాగుతూ వచ్చింది. డీఎస్పీ హోదా పోయి, ఇప్పుడు తొలిసారిగా ఐపీఎస్ హోదా కలిగిన ఏఎస్పీ వచ్చారు. ఇప్పటి వరకు రాజంపేట డీఎస్పీలుగా 28 మంది పనిచేశారు.అయితే ఇప్పుడు ఐపీఎస్ అధికారి నియమాకంతో రాజంపేట సబ్‌డివిజన్ రూపురేఖలు మారనున్నాయి.
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల నిలయం
రాజంపేట ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్‌ఐ, ఐఎఫ్‌ఎస్ అధికారుల నిలయంగా మారింది. ఒకరంగా జిల్లాకేంద్రంలో ఉండే అత్యున్నతస్ధాయి అధికారులు కీలమైన శాఖకు పనిచేయడం చర్చనీయాంశమైంది.ఇప్పటికే ఇక్కడ ఐఏఎస్ హోదా కలిగిన సబ్‌కలెక్టర్ వైఖోమానైదియాదేవి, రాజంపేట కేంద్రంగా జిల్లా అటవీశాఖ అధికారిగా ఐఎఫ్‌ఎస్ అధికారి జగన్నాథ్‌సింగ్ కొనసాగుతున్నారు. పోలీసుశాఖకు సంబంధించి ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం నియమించడం ఇదే ప్రప్రథమం కావడం విశేషం. ఇక్కడ డీఎస్పీగా సుధాకర్ పనిచేస్తున్నారు. ఈయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఏఎస్పీగా మనోజ్‌రామ్‌నాథ్‌హెగ్డే
రాజంపేట ఏఎస్పీగా మనోజ్‌రామ్‌నాథ్‌హెగ్డేను ప్రభుత్వం నూతనంగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈయన గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్‌గా పనిచేశారు. ఈయనను ఏఎస్పీగా రాజంపేట సబ్‌డివిజన్‌కు బదిలీ చేసింది. ఈయన 2022 బ్యాచ్‌కు చెందినవారుగా చెపుతున్నారు.
ఎందుకు ఐపీఎస్‌ను వేయాల్సి వచ్చింది
గ్రూప్–1 స్ధాయి అధికారినే రాజంపేట ఎస్‌డీపీఓగా నియమిస్తూ వచ్చారు. లేకపోతే డిపార్టుమెంట్‌లో పదోన్నతిపై వచ్చిన వారే ఎస్‌డీపీఓగా నియమితులయ్యేవారు. ఇప్పుడు ఐపీఎస్ స్థాయి హోదా కలిగిన అధికారిని నియమించడంపై అనుమానాలు పోలీసువర్గాల్లో రేకేత్తిస్తున్నాయి.గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్, నేరాలు లాంటివి పెరిగిపోతున్నాయా అనే కోణంలో ఏఎస్పీని ప్రభుత్వం నియమించినట్లుగా పోలీసువర్గాలు భావిస్తున్నాయి. ఏదీఎమైనప్పటికి రాజంపేట ఏఎస్పీని ప్రభుత్వం నియమించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment