రాయచోటి : భోగి పండుగను జిల్లావ్యాప్తంగా సంప్రదాయ బద్ధంగా నిర్వహించుకున్నారు.సోమవారం తెల్లవారుజామున పిల్లలు, పెద్దలు వీధుల్లో భోగి మంటలు వేశారు. మహిళలు అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలతో ఇళ్ల ముంగిళ్లను తీర్చి దిద్దారు. కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. కొంతమంది పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ ఆనందంగా గడిపారు. ఇంకో వైపు ఉదయాన్నే భక్తులు ఆలయాలకు తరలివెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.డూ డూ బసవన్నల ఆటలు, హరిదాసుల పాటలు కనిపించకపోయినా,,, భోగి పండుగను తమకు ఉన్నంతలో కుటుంబ సభ్యులతో సంతోషంగా నిర్వహించుకున్నారు. బంధువులు, మిత్రులు ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలను తెలుపుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment