రేపటి నుంచి పీరయ్య స్వామి ఆరాధనోత్సవాలు
చిన్నమండెం : మండల పరిధిలోని చిన్నర్సుపల్లె గ్రామం పీరయ్యమఠంలో 219 సంవత్సరాల క్రితం సజీవ సమాధి అయిన పీరయ్యస్వామి ఆరాధనోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి రెండు రోజుల పాటు నాలుగో పీఠాధిపతి మఠం నాగలింగమయ్య ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు మంత్రి మండిపల్లి పీరయ్యస్వామి సుప్రభాతం పుస్తకావిష్కరణ రాంప్రసాద్‌రెడ్డి చేతులమీదుగా జరగనుంది. రాత్రి 8 గంటల నుంచి అఖండ భజన, చెక్కభజన, కోలాటం నిర్వహించనున్నారు. గురువారం ఉదయం మౌలాలి జెండా ఊరేగింపు జరుగుతుంది.భక్తులు ఆరోధనాత్సవాల్లో పాల్గొనాలని మఠాధిపతి వారసులు తెలిపారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో నియామకాలు
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలలో వైఎస్సార్ జిల్లాకు చెందిన పలువురిని నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. స్టేట్ వలంటీర్స్ విభాగం ఉపాధ్యక్షుడిగా ఎర్రబోతుల శివ భాస్కర్ రెడ్డి, స్టేట్ మున్సిపల్ విభాగం ప్రధాన కార్యదర్శిగా రాచపల్లి వెంకట సుబ్బారెడ్డి, స్టేట్ మున్సిపల్ విభాగం కార్యదర్శిగా పల్లారెడ్డి భాస్కర్, స్టేట్ మున్సిపల్ వి ౌగ్ జాయింట్ సెక్రటరీగా డి వెంకటసుబ్బయ్య లను నియమించారు.
వైభవంగా రామయ్య
పౌర్ణమి కల్యాణం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా సీతారాముల ఉత్సవ మూర్తులకు అర్చకులు కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాలయ అవరణలో ప్రత్యేక కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు. సీతా రాముల ఉత్సవ మూర్తులను నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. అనంతరం ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యులు, అర్చకులు వీణా మనోజ్‌కుమార్‌లు స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. కల్యాణం వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
రామయ్యను దర్శించుకున్న ప్రకాశం జిల్లా న్యాయమూర్తి
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారిని సోమవారం ప్రకాశం జిల్లా న్యాయమూర్తి ఎ. భారతి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.బాలాలయంలో ఉన్న మూల విరాట్‌లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.
కళలను ఆదరించాలి
ప్రొద్దుటరు కల్చరల్ : కళలను, సంస్కృతి, సాంప్రదాయాలను ఆదరించాలని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడు వంగల శశిభూషణ్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్న రాయలసీమ సంగీత నృత్యోత్సవాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా పలువురికి రాయలసీమ సంగీతరత్న, నాట్యరత్న అవార్డు అందించి సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment