మాట్లాడుతున్న ఏపీ బీసీ చైతన్య సేవాసమితి అధ్యక్షుడు బి.సి.రమణ
రాయచోటి అర్బన్ : నేటివరకు చట్టసభల్లో అడుగుపెట్టని బీసీ కులాలకు అన్ని రాజకీయ పార్టీల నేతలు సీట్లు కేటాయించాలని ఏపీ బీసీ చైతన్య సేవాసమితి అధ్యక్షుడు బి.సి.రమణ డిమాండ్ చేశారు. స్థానిక సాయి శుభ కల్యాణ మండపంలో జీవానందం అధ్యక్షతన జరిగిన రాజంపేట పార్లమెంట్ స్థాయి బీసీ శక్తి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కుమ్మరి, సాలె, రజక, మంగళి, వడ్డెర తదితర బీసీ కులాల వారికి నేటికీ చట్టసభలలో ప్రాతినిధ్యం లేకపోవడం దారుణమన్నారు. ఎన్‌ఆర్‌ఐ టి.వెంకటసుబ్బయ్య, పాల ఏకరి సాధికార సమితి అధ్యక్షుడు శివప్రసాద్ మాట్లాడుతూ బీసీ కులాల అభ్యర్థులు చట్టసభలకు పోటీచేస్తే వారికే తమ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్.శివప్రసాద్, టీడీపీ వడ్డెర సాధికార సమితి రాష్ట్రకార్యవర్గ సభ్యుడు నాగార్జున, రజక సంఘం నేతలు రమేష్‌బాబు, శ్రీనివాసులు, బీసీ చైతన్య సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.వి.భద్ర, మదనపల్లె నాయకులు చిరంజీవి, గోపాల్, వడ్డెర సంఘం నాయకుడు మల్లెల రెడ్డెన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment