బాబాయిని కత్తితో పొడిచిన అబ్బాయి | - | Sakshi
Sakshi News home page

బాబాయిని కత్తితో పొడిచిన అబ్బాయి

Published Wed, Oct 30 2024 1:46 AM | Last Updated on Wed, Oct 30 2024 1:46 AM

బాబాయిని కత్తితో పొడిచిన అబ్బాయి

బాబాయిని కత్తితో పొడిచిన అబ్బాయి

పీలేరు : పిల్లల ఆలనా పాలనా చూసుకోవాల్సిన బాబాయి.. మద్యం తాగి రోజూ వేధిస్తుండడంతో ఆయన అన్న కుమారుడు కత్తితో పొడిచి చంపిన సంఘటన పోమవారం రాత్రి అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలంలో చోటుచేసుకుంది. పట్టణం లోని ఎన్‌టీఆర్‌ కాలనీకి చెందిన రవి, రమేష్‌ అన్నదమ్ములు. రవి, అతడి భార్య షర్మిల బెంగళూరులో వాచ్‌మెన్‌లుగా పనిచేస్తున్నారు. రవి కుమారుడు (14) వాల్మీకిపురం పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. బాబాయ్‌ రమేష్‌(35)తో కలిసి ఇంటి వద్ద నివసిస్తున్నాడు. రమేష్‌ కూలి పనులకు వెళ్తూ ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. ఇంటికి వచ్చి మైనర్‌ బాలుడిని నిత్యం కొడుతూ వేధింపులకు గురిచేసేవాడు. సోమవారం రాత్రి మరోసారి గొడవకు దిగి వేధిస్తుండడంతో మైనర్‌ బాలుడు ఆగ్రహంతో ఇంట్లో కూరగాయలు తరిగే కత్తితో అతడిని పొడిచేశాడు. రమేష్‌ రక్తపు మడుగులో పడి ఉండటం స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. 108 అక్కడికి చేరుకునే సమయానికి రమేష్‌ మృతి చెందాడు. వాల్మీకిపురం సీఐ ప్రసాద్‌బాబు, ఎస్‌ఐ చంద్రశేఖర్‌ లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడికోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement