రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలు
మదనపల్లె : రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. పుంగనూరు మండలం లబ్దిగం గ్రామానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి బాబు (50), భార్య సరస్వతి(45) తో కలిసి ద్విచక్రవాహనంలో సొంత పనుల నిమిత్తం మదనపల్లెకు వచ్చారు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా పుంగనూరు రోడ్డులోని బసినికొండ బైపాస్‌రోడ్డు వద్ద ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో సరస్వతి, బాబు తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు బాఽధితులను స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సరస్వతి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment