రాజంపేట మున్సిపాల్టీకి ఎంపీ నిధులు
రాజంపేట : రాజంపేట మున్సిపాలిటీ పారిశుద్ధ్యానికి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి తన ఎంపీ కోటాలో నిధులను కేటాయించారు. ఈ మేరకు గురువారం రాత్రి మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాజంపేట పట్టణంలో శానిటేషన్‌కు సంబంధించి తన ఎంపీ నిధుల నుంచి ఆర్థిక సాయం చేయాలని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డిని కలిసి కోరామన్నారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి తన కోటా నుంచి రూ. 20 లక్షలు కేటాయించారన్నారు. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. పారిశుద్ధ్య విభాగానికి రెండు ట్రాక్టర్లు కొనుగోలు చేసి మున్సిపాలిటీకి అందజేస్తామన్నారు. నిధుల మంజూరుపై మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి కూడా మేడా రఘునాథరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
అవమానకరంగా
దూషించారంటూ కేసు నమోదు
ఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్ట కల్లా వీధికి చెందిన సిర్రారపు నారాయణమ్మను అవమానకరంగా దూషించారని నలుగురిపై కేసు నమోదు చేశారు. ఒంటిమిట్ట ఎస్‌ఐ శివప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. కల్లా వీధికి చెందిన బాధితురాలు నారాయణమ్మ, నిందితులు మల్లికార్జున, సరస్వతి, శివ, లోకేష్ పక్క పక్క ఇంటి వారు. వారి ఇంటి మధ్యలో ఉన్న గోడ విషయమై మాటామాటా పెరిగిపోవడంతో నారాయణమ్మను వారు నలుగురు వీధిలో అందరి ఎదుట అవమానకరమైన మాటలతో దూషించారు. దీంతో బాధితురాలు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
ఒంటిమిట్ట రామయ్యను దర్శించుకున్న ఎమ్మెల్యే
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయాన్ని గురువారం ఆముదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బాలాలయంలోని సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారిని సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment