వరదనీటి సమస్యను పరిష్కరిస్తాం
నందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ ఆర్‌అండ్‌బీ బంగ్లా వెనుకవైపుగల ఇండ్లచుట్టూ చెయ్యేరు నుంచి కన్యకాచెరువుకు కయ్యం కాలువ ద్వారా ఇటీవల కురిసిన వర్షానికి వరదనీరు ఇళ్లను చుట్టుముట్టింది. ప్రజలు జల దిగ్భందంలో ఇరుకున్నారు. విషయం తెలుసుకున్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి శుక్రవారం ఉదయం బాధితుల ఇళ్లవద్దకు వెళ్లి పరామర్శించి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెయ్యేరు నుంచి కన్యకా చెరువుకు నీరు అందించే ప్రధాన కాలువ పలుచోట్ల లీకేజికి గురి కావడంవల్ల ఆ నీరు ఇండ్ల చుట్టూ చేరి ప్రజలను భయాందోళనకు గురైన విషయం తమ దృష్టికి తేవడం జరిగిందన్నారు. సమస్యను రాజంపేట సబ్ కలెక్టర్ వైఖోమ్ నదియా దేవికి ఫోన్ ద్వారా వివరించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన సబ్ కలెక్టర్ స్థానిక తహసీల్దార్ అమర్నాథ్‌ను బాధిత కుటుంబాల వద్దకు పంపించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించాలని కన్యకా చెరువునీటి సంఘం అధ్యక్షులు భూశెట్టి వెంకటసుబ్బయ్యను ఆదేశించామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొబ్బిళ్ల త్రినాథ్, సౌమ్యనాథ స్వామి ఆలయ మాజీ చైర్మన్ అరిగెల సౌమిత్రి, ఉప సర్పంచ్ ఇబు, వైఎస్సార్ సీపీ నాయకులు గుండు మల్లికార్జున రెడ్డి, నడివీధి సుధాకర్, పల్లె గ్రీష్మంత్ రెడ్డి, ఆకేపాటి జగదీశ్వర్ రెడ్డి, హస్తవరం సుబ్బరామిరెడ్డి, అరిగె హరిబాబు, ఆనాల మధ యాదవ్, అజీజ్, సుభాన్, నవాబ్, కరిముల్లా, అన్సార్ బాష, మహబూబ్ బాషా, ముమ్మడి శెట్టి సుధాకర్, పుత్తా శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment