కార్మిక సమస్యలపై ప్రభుత్వాల నిర్లక్ష్యం
రాయచోటి అర్బన్ : కార్మిక సమస్యల పరిష్కారంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగసుబ్బారెడ్డి అన్నారు. పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా స్థాయి జనరల్‌బాడీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ,రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కార్మిక సమస్యల పరిష్కారంలో దారుణంగా వైఫల్యం చెందాయన్నారు. సంపదను సృష్టిస్తున్న కార్మికుల హక్కులను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్‌కోడ్‌లను తీసుకువచ్చి తీరని అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలని, కార్మికుల వలసలు నివారించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరి 16,17 తేదీలలో రైల్వేకోడూరులో జిల్లా ద్వితీయ మహాసభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పియల్ నరసింహులు, కార్యదర్శి గంగాధర్, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వరమ్మ, సరోజమ్మ, భవన నిర్మాణ సంఘం నేతలు వేణుగోపాల్‌రెడ్డి, సలీంబాష, బత్తల రమణయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేత సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment