పుల్లంపేటలో ఐదుగురు స్మగ్లర్లు అరెస్టు
రాజంపేట : పుల్లంపేట పోలీసుస్టేషన్ పరిధిలో అనంతసముద్రం పంచాయతీ బోటుమీదపల్లెకు చెందిన ఐదుమంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశామని రాజంపేట డీఎస్పీ సుధాకర్ తెలిపారు. శుక్రవారం రూరల్ సీఐ కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు. అరెస్టు అయిన వారిలో బోటుమీదపల్లె గ్రామానికి ఉత్తరంవైపు ఉన్న ఊరుగట్టు వద్ద సాలనగంగయ్య(బోటుమీదపల్లె), అక్కని నరసింహులు(బోటుమీదపల్లె), బొర్సు సుబ్బరాయుడు(బోయనపల్లె, రాజంపేట), చల్లా వెంకటస్వామి(కడప, శ్రీరాంనగర్), నక్క చిన్న వెంకటసుబ్బయ్య(నాగసానిపల్లె, ఖాజీపేట మండలం) ఉన్నారన్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.4,31,200 విలువ చేసే 15 ఎర్రచందనం దుంగలను స్వాదీనం చేసుకున్నామన్నారు. రూ.80వేలు విలువ చేసే రెండు బైకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. కోర్టుకు హాజరపరచగా రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ వెల్లడించారు. స్మగర్లను పట్టుకోవడంలో రూరల్ సీఐ బీవీరమణ, పుల్లంపేట, నందలూరు ఎస్‌ఐలు, రెడ్‌శ్యాండల్ టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ రాజ్‌కుమార్ వారి సిబ్బంది, ఎఫ్‌బీఓలు ప్రధాన పాత్ర పోషించారన్నారు.
15 ఎర్రచందనం దుంగలు పట్టివేత
రెండు బైకులు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment