భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి
రాయచోటి అర్బన్ : గాలివీడు గ్రామానికి చెందిన వృద్ధురాలు షంషాద్ భూమిని కబ్జా చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పోరెడ్డి రమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాలివీడు రెవెన్యూ అధికారుల అలసత్వ వైఖరిని ఖండిస్తూ ఆయన శుక్రవారం బాధితురాలు షంషాద్, ఆమె కుటుంబీకులతో కలసి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గాలివీడులో డీకేటీ భూమిని ప్రభుత్వం షంషాద్ భర్త హుస్సేన్ సాహెబ్ పేరుమీద మంజూరు చేసింది. హుస్సేన్ సాహెబ్ మరణాంతరం షంషాద్ సదరు భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోందన్నారు. కాగా అదేగ్రామానికి చెందిన శనగకాయల మిల్లుల యజమానాలు షేక్ అహమ్మద్ బాషా, జిలానీ బాషా భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారన్నారు. 2022లో అప్పటి జిల్లా ఉన్నతాధికారుల జోక్యం కారణంగా కబ్జాదారులు కొద్దిరోజులు మిన్నకుండి పోయారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కబ్జాదారులు తప్పుడు డాక్యుమెంట్లు పాసు బుక్కులు తయారు చేసుకుని తిరిగి భూ ఆక్రమణకు ప్రయత్నిస్తూ వృద్ధురాలు షంపాద్‌ను తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు. భూకబ్జాకు ప్రయత్నిస్తున్న వారిని, వారికి సహకరిస్తున్న రెవెన్యూ అధికారులపై తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.
కలెక్టరేట్ ఎదుట నిరసన
Comments
Please login to add a commentAdd a comment