పెండింగ్ నిధులను విడుదల చేయాలని బైఠాయింపు
రాయచోటి అర్బన్ : రాష్ట్రంలో డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్నటువంటి రూ. ఫీజురియింబర్స్‌మెంట్, వసతిదీవెన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. నిధుల విడుదలలో ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యవైఖరిని నిరసిస్తూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులు పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. నేతాజి సర్కిల్‌లో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజురియింబర్స్‌మెంట్ కింద రూ. 3,580 కోట్లు, వసతి దీవెన కింద రూ.1480 కోట్ల నిధుల విడుదలలో చూపుతున్న నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు అనేక ఇక్కట్లకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం నుంచి పైపథకాల నిధులు విద్యాసంస్థల ఖాతాలలోకి చేరలేదనే కారణంతో యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయన్నారు. యువగళం పాదయాత్రలో మంత్రి లోకేష్‌బాబు హామీ ఇచ్చిన విధంగా జిఓ నం.77ను వెంటనే రద్దుచేయాలన్నారు. పాలకులు స్పందించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమించనున్న ట్లు వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రశాంత్, మాధవ్, జిల్లా ఉపాధ్యక్షుడు వినోద్, గర్‌ల్స్‌కో కన్వీనర్ భవిత, రాయచోటి నేతలు కార్తీక్, లోకేష్, గణేష్‌తో పాటు పెద్ద త్తున విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment