ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

Published Sun, Jan 19 2025 1:53 AM | Last Updated on Sun, Jan 19 2025 1:53 AM

ప్రశా

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

రాయచోటి: జవహర్‌ నవోదయ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. శనివారం అన్నమయ్య జిల్లాలో 26 పరీక్షా కేంద్రాలలో ప్రవేశ పరీక్షలను నిర్వహించారు. 6వ తరగతిలో ప్రవేశం పొందేందుకు 5058 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. శనివారం నిర్వహించిన పరీక్షలలో 4242 మంది విద్యార్థులు హాజరుకాగా 816 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం పరిశీలించారు.

గణతంత్ర వేడుకలకు

నూలివీడు విద్యార్థులు

గాలివీడు: విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో జనవరి 26వ తేదీన జరగనున్న గణతంత్ర వేడుకల పెరేడ్‌లో నూలివీడు విద్యార్థులు మార్చ్‌ ఫాస్ట్‌ నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ స్కౌట్‌ మాస్టర్‌ కరకోటి చంద్రశేఖర్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ 76వ భారత గణతంత్ర రాష్ట్ర స్థాయి వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో రాయలసీమ జోన్‌ (8 జిల్లాలు) నుంచి నూలివీడు జిల్లాపరిషత్‌ హైస్కూల్‌ 9వ తరగతి ఇద్దరు గైడ్‌ విద్యార్థులు కె.వైష్ణవి, పి.గీతామాధురి, ఇద్దరు స్కౌట్‌ విద్యార్థులు డి.నరసింహా, పి.గణేష్‌ ఎంపికయ్యారన్నారు. రాష్ట్రస్థాయి పెరేడ్‌కు మారుమూల ప్రాంతమైన నూలివీడు హైస్కూల్‌ విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, చైర్మన్‌ జనార్దన్‌, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

హుండీ ఆదాయం

రూ.7 లక్షల 21వేలు

గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయానికి హుండీ ద్వారా రూ.7,21,112 ఆదాయం సమకూరింది. శనివారం స్థానిక ఆలయంలో రాయచోటి దేవదాయశాఖ అధికారి శశికుమార్‌ ఆధ్వర్యంలో అమ్మవారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మూడు నెలల కాలానికి సంబంధించి వివిధ కానుకలు, నగదు రూపంలో రూ.7,21,112, బంగారు ఆభరణాలు 29 గ్రాములు, వెండి 425 గ్రాములు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మొత్తాన్ని వాల్మీకిపురం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శశికుమార్‌, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

23న జిల్లా స్థాయి క్విజ్‌ పోటీలు

కడప ఎడ్యుకేషన్‌: ఈ నెల 23న ఉదయం పది గంటలకు కడప రిమ్స్‌ వద్దగల కేంద్రీయ విద్యాలయంలో జిల్లా స్థాయి క్విజ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ మీనాక్షి తెలిపారు. పోటీల్లో పాల్గొనే 9, 10వ తరగతి విద్యార్థులు 23న ఉదయం 8.30 గంటలకు రిమ్స్‌ వద్ద కేంద్రీయ విద్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని డీఈఓ మీనాక్షి తెలిపారు. వివరాలకు 9490633934 నెంబర్‌లో సంప్రదించాలని ఆమె తెలిపారు.

మాస్టర్‌ ట్రైనర్ల కృషి

ప్రశంసనీయం

కడప సెవెన్‌రోడ్స్‌: సుస్థిర వ్యవసాయం, ఆగ్రో ఫారెస్ట్రీ, మొక్కల సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడంలో టీఓఎఫ్‌ మాస్టర్‌ ట్రైనర్ల కృషి ప్రశంసనీయమని జిల్లా అటవీ అధికారి ఎన్‌.శివకుమార్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ ఓ–బ్లాక్‌లోని సమావేశ మందిరంలో మాస్టర్‌ ట్రైనర్ల సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతనెల 8న వ్యవసాయ, ఉద్యాన, డీఆర్‌డీఏ, ఎఫ్‌పీఓ శాఖల నుంచి ఎంపిక చేసిన మాస్టర్‌ ట్రైనర్లు ఐదు రోజులపాటు ఆగ్రో ఫారెస్ట్రీ మొక్కల సాగుపై శిక్షణ పొందారన్నారు. వీరు జిల్లాలోని 58 గ్రామాల్లో 6141 మంది రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి వారికి అవగాహన కల్పించారన్నారు. ప్రభుత్వం నిర్దశించిన లక్ష్యాలను సాధించడంలో మాస్టర్‌ ట్రైనర్ల కృషి మరువలేనిదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష  1
1/2

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష  2
2/2

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement