పీలేరు: వయోజనులంతా ఓటు హక్కు కలిగి ఉండాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, నియోజకవర్గపు ఎన్నికల అధికారి రమా అన్నారు. శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురష్కరించుకుని పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశ భవిష్యత్తును, మన భవిష్యత్తును ఉన్నతంగా మలచుకోవడానికి ఓటుహక్కు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ భీమేశ్వర్‌రావు, ఏఎస్‌వో రామ్మోహన్, డీటీ సుబ్రమణ్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment