రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
చిన్నమండెం: చిన్నమండెం మండలం ఏపీ మోడల్ స్కూల్ విద్యా ర్థిని కె.లోహితారెడ్డి రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో విద్యార్థిని ప్రథమస్థానం పొందినట్లు చెప్పారు. ఆదివారం విజయవాడలో ఎస్‌డీపీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం, జ్ఞాపికను, నగదు బహుమతిని లోహితారెడ్డి అందుకోనున్నట్లు తెలిపారు.విద్యార్థినికి ప్రిన్సిపల్ రమేష్, ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.
మల్లయ్యకొండకు రూ.19.88 లక్షల ఆదాయం
తంబళ్లపల్లె: మహాశివరాత్రికి మల్లయ్యకొంండపై జరిగే ఉత్సవాలకు సంబంధించి దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ శశికుమార్, ఈఓలు మునిరాజ, రమణ ఆధ్వర్యంలో వేలం పాట జరిగింది. వాహనాల పార్కింగ్ నిర్వహణను పి.రెడ్డప్పరెడ్డి రూ.4,72,000 కు దక్కించుకున్నారు. తలనీలాల సేకరణ బాలకృష్ణ రూ.3,51,000కు పాడుకున్నారు. గౌరమ్మగుడి పూజా నిర్వహణ బావయ్య రూ.3,81,00కు, ఏనుగుమల్లమ్మగుడి పూజా నిర్వహణ శేఖర్ రూ.2,22,000కు, కొబ్బరి చిప్పల సేకరణను గోపాలకృష్ణారెడ్డి రూ.21,000కు, లడ్డు(ప్రసాదం) అమ్మకాలకు సంబంధించి మోహన్ రూ.4,81,000కు పాట దక్కించుకున్నారు. దీంతో మొత్తం రూ.19.88 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
బాధ్యతల స్వీకరణ
రాయచోటి టౌన్: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) జిల్లా అధికారిగా కె.రమణారెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు అందాయి. అదేరోజు సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈయన జిల్లాలోని రాజంపేట. మదనపల్లె, రాయచోటి మెప్మా పరిధిలోని సంఘాలను బలో పేతం చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
వైభవంగా ఆరాధనోత్సవాలు
రామాపురం: మండలంలోని నీలకంట్రావుపేట గ్రామం శ్రీ దర్బారు సాయి నగరంలోని శ్రీ దర్గా స్వామిజీ మాతాజీ ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహించారు. బెంగళూరుకు చెందిన వేద పండితులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. రెండురోజులుగా జరగుతున్న ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2024లో నీట్‌లో ఎక్కువ మార్కులతో ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు శ్రీ దర్గా స్వామిజీ ట్రస్టు నుంచి విద్యార్ధికి రూ10వేల చొప్పున చెక్కును అందజేశారు. రాయచోటికి చెందిన చిన్న పిల్లల వైద్య నిపుణులు బయారెడ్డి ఉత్సవాలకు హాజరయ్యారు.
సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో విద్యార్థుల ప్రతిభ
రాయచోటి/కలకడ: సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో అన్నమయ్య జిల్లా, కలకడ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారని జిల్లాసైన్స్ అధికారి ఓబుల్‌రెడ్డి శనివారం తెలిపారు. ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు పుదుచ్చేరిలోని ఓల్డ్ ఫోర్ట్ గ్రౌండ్‌లో నిర్వహించిన సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో మహమ్మద్ సుహేల్, రెహాన్‌లు గ్రూపు విభాగంలో ప్రథమస్థానం పొందారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో దక్షిణ భారతదేశానికి చెందిన 8 రాష్ట్రాల నుండి 270 ప్రాజెక్టులను ప్రదర్శించినట్లు చెప్పారు. సుహేల్, రెహాన్‌లు ప్రదర్శించిన బయో ఎంజైన్స్ ప్రాజెక్టు గ్రూపు విభాగం నుంచి మొదటిస్థానంలో నిలిచిందన్నారు. పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ సెల్వం, విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం చేతులమీదుగా రూ. 2 వేల నగదు, మెమెంటో, ప్రశంసాపత్రాలు వీరు అందుకున్నారన్నారు. వీరికి గైడ్ టీచర్‌గా సుమతి వ్యవహరించారు. విద్యార్థులు, గైడ్ టీచర్‌ను డీఈఓ సుబ్రమణ్యం, ఉప విద్యాశాఖాధికారి శివప్రకాష్ రెడ్డి, జ్లిలా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి, ప్రిన్సిపాల్ మలామ్‌షా వలిలు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment