రాజంపేట : రాజంపేట–నెల్లూరు రహదారిలోని పోలిచెరువుకట్ట (రాజంపేట)పై శనివారం ఆటో, బైకు ఢీ కొన్నాయి. పోలి గ్రామం నుంచి మదనపల్లె చంద్రశేఖర్ బైకులో వస్తున్న క్రమంలో ఆటోను ఢీ కొన్నారు. బైక్ నడుపుతున్న క్షతగాత్రునికి తీవ్రగాయాలయ్యాయి. ఆటోలు ఉన్న డ్రైవరుతో సహా ముగ్గురికి గాయాలు అయ్యాయి. వీరిని 108లో రాజంపేట ప్రాంతీయ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. మన్నూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఒంటిరి యువతిపై దాడి
గుర్రంకొండ : ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ యువతిపై దాడి చేసిన సంఘటన మండలకేంద్రమైన గుర్రంకొండలో చోటుచేసుకుంది. స్థానిక ఇందిరమ్మ కాలనీలో నాగరాజ అనే వ్యక్తి తాపీ మేసీ్త్ర పనిచేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని కుటుంబానికి పక్కనే ఉన్న శ్యామలమ్మ కుటుంబానికి ఇంటి స్థలం విషయమై గతంలో వివాదాలు జరిగాయి. ఈనేపథ్యంలో గత శుక్రవారం నాగరాజ కుమార్తె బి. శ్రీలేఖ(20) ఇంట్లో ఒంటిరిగా ఉండగా పాత కక్షలు మనసులో ఉంచుకొని శ్యామలమ్మ అతని కుటుంబ సభ్యులు శ్రీలేఖపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకొన్న కటుం బసభ్యులు హుటాహుటిన బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. జరిగిన సంఘటనపై బాధితురాలి తండ్రి నాగరాజ స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆరు గొర్రెలు
అనుమానాస్పద మృతి
రామసముద్రం : మండలంలోని చొక్కాండ్లపల్లి పంచాయతీ పురాండ్లపల్లి గ్రామంలో అనుమానాస్పదంగా ఆరు గొర్రెలు శనివారం మృతి చెందాయి. వివరాలిలా.. పురాండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు రత్నప్ప భార్య సరోజమ్మలకు 60 గొర్రెలు ఉన్నాయి. వాటిని మేపేందుకు గ్రామ పొలిమేరలకు వెళ్లారు. సాయంత్రం సమీపంలోని మొక్కజొన్న తోటలో గొర్రెలు మేస్తుండగా రెండు గొర్రెలు అనుమానాస్పదంగా అక్కడిక్కడే మృతి చెందాయి. గమనించిన రైతు వెంటనే స్థానిక పశువైద్య సిబ్బందికి సమాచారం అందించారు. స్పందించిన సచివాలయ వెటర్నరీ సిబ్బంది మణి, యుగంధర్, అటెండర్ రెడ్డప్ప తదితరులు అక్కడికి చేరుకొని గొర్రెలను పరిశీలించి చికిత్స చేసి టీకాలు వేశారు. చికిత్స చేస్తుండగా మరో నాలుగు గొర్రెలు అక్కడే విలవిలలాడుతూ మృతి చెందాయి. రైతు కుటుంబం లబోదిబోమంటూ విలపించారు. మొక్కజొన్న తోటలో గడ్డి నివారణ మందులు ఏమైనా పిచికారి చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కోతకు గురైన భూముల పరిశీలన
సిద్దవటం : మండలంలోని కడపాయపల్లె, లింగంపల్లె, టక్కోలు గ్రామాలలోని రైతుల భూములు పెన్నానది వరద నీటికి కోతకు గురయ్యాయి. ఆ భూములను శనివారం ఇరిగేషన్ ఏఇ సాయికృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టక్కోలు గ్రామ సర్పంచ్ లక్ష్మిదేవి గత ఏడాది డిశంబర్ 31వ తేదీన తమ విలువైన భూములు పెన్నానది వరద నీరు కోతకు గురవుతున్నాయని స్పందనలో ఫిర్యాదు చేసిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోతకు గురైన భూములను పరిశీలించామన్నారు. పెన్నానదిలో నీరు ఎక్కువగా ప్రవహిస్తుందని, నీరు తగ్గిన వెంటనే కోతకు గురైన పంట పొలాలను సర్వే నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment