ములకలచెరవు: తంబళ్లపల్లె నియోజక వర్గం ములకలచెరువు మండలం నుంచి టమాటా అండమాన్ నికోబార్ దీవులకు ఎగుమతి అవుతోంది. ములకలచెరువుకు చెందిన రైతు మునీర్ సాగు చేసిన తోట నుంచి టమాటాలను కర్ణాటక రాష్ట్రం చింతామణికి చెందిన వ్యాపారులు వచ్చి కొనుగోలు చేశారు. ఒక్కో బాక్స్ రూ.450తో కొన్నారు. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో బాక్స్ కేవలం రూ. వంద నుంచి రూ. 200 మాత్రమే పలుకుతోంది. తోట దగ్గరకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తుండడంతో రైతుకు గిట్టుబాటు లభిస్తోంది. ములకలచెరువు నుంచి టమాటాలను మినీ లారీలో తమిళనాడు రాష్ట్రం చైన్నెకి తీసుకెళ్లి అక్కడి నుంచి షిప్ ద్వారా అండమాన్ నికోబార్ దీవులకు తరలిస్తున్నారు. ఇక్కడి నుండి అండమాన్ నికోబార్ దీవులకు మూడు వేల కిలోమీటర్లు దూరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment