అంబేడ్కర్‌ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి

Published Sat, Nov 23 2024 10:00 AM | Last Updated on Sat, Nov 23 2024 10:00 AM

-

ఏఎన్‌యూ: అంబేడ్కర్‌ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ కోరింది. ఈ మేరకు శుక్రవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పోస్ట్‌ కార్డుల ఉద్యమాన్ని నిర్వహించింది. యూనివర్సిటీ అంబేడ్కర్‌ అధ్యయన కేంద్రం తదితర విభాగాల్లో సంతకాల సేకరణ చేపట్టారు. తమ డిమాండ్‌ను పోస్ట్‌ కార్డులపై రాసి సంతకాలు చేశారు. అంబేడ్కర్‌ గొప్పతనాన్ని భావి తరాలకు తెలియజేయాలంటే అయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా మార్చాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ నాయకులు, యూనివర్సిటీ అంబేడ్కర్‌ చైర్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement