వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
బాపట్ల టౌన్ : వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ మజుందార్ కోరారు. గ్రామ, వార్డు వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పట్టణంలో ధర్నా నిర్వహించారు. మజుందార్ మాట్లాడుతూ వలంటీర్ల బకాయి వేతనాలు చెల్లించాలని పది వేల వేతన హామీలు నెరవేర్చాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వలంటీర్ వ్యవస్థను కాపాడతామని, పదివేల రూపాయలు వేతనం చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చాయి. కానీ నేడు ఎన్నికల అనంతరం వలంటరీ వ్యవస్థ లేదని ప్రకటించడం దారుణమన్నారు. కరోనా లాంటి విపత్కర సమయంలో, విజయవాడ వరదల సమయంలో వీరు చేసిన సేవలను గుర్తు లేవా అని ప్రశ్నించారు. సకాలంలో వృద్ధులు, వితంతులకు పెన్షన్లు అందించే సమయంలో వలంటీర్ల సేవలను ప్రజలు పెద్ద ఎత్తున హర్షించారని, ధర్నా అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కోటేశ్వరి, అనూష, షేక్ షకీరా, ఎం. లక్ష్మి, ఎం జ్యోతి, కే అరుణ, సీఐటీయూ జిల్లా నాయకులు కె.శరత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment