పశ్చిమ డెల్టా సిస్టమ్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఎన్ని
అమర్తలూరు (వేమూరు): రైతులు సాగు చేస్తున్న చివర భూముల వరకు సాగు నీరు అందజేసేందుకు నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించినట్లు బాపట్ల జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వేమూరు నియోజకవర్గంలోని అమర్తలూరు మండలం కూచిపూడి లాకుల ఇరిగేషన్ కార్యాలయంలో శనివారం పశ్చిమ డెల్టా సిస్టమ్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. చైర్మన్‌గా పి.మురళీధర్, వైస్ చైర్మన్‌గా ఎన్. సునీల్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆయన తెలిపారు. చైర్మన్ పదవిలో రెండు సంవత్సరాలు పి.మురళీధర్, మూడు సంవత్సరాలు ఎన్. సునీల్ చౌదరి ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల వీరాంజనేయులు,, రేపల్లె ఆర్‌డీవో రామలక్ష్మి, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment