డీఎంహెచ్‌వో విజయలక్ష్మి
బాపట్లటౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా డీఎంఅండ్‌హెచ్‌వో విజయలక్ష్మి తెలిపారు. మండలంలోని వెదుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలోని ఓపీ వివరాలు, రోగులకు అందిస్తున్న వైద్యసేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెదుళ్లపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. చిన్నారులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ వైష్ణవికృష్ణ, హెల్త్ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment