ఊరూవాడా ఉత్సాహం
బాపట్లటౌన్: పేదల అభ్యున్నతి కోసం అహర్నిశలు తపిస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం అంబరాన్నంటాయి. ఫలితంగా ఊరూవాడా ఉత్సాహంతో ఉప్పొంగింది. జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జననేత పుట్టిన రోజును వేడుకగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పట్ణణ, మండల, గ్రామీణ ప్రాంతాల్లో భారీ కేక్‌లు కట్‌చేసి సంబరాలు చేశారు. గ్రామస్తులకు స్వీట్లు పంచిపెట్టారు. ఏరియా వైద్యశాలల్లోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ పాలనలో చేసిన మేలును ప్రజలు గుర్తుచేసుకున్నా రు. ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేసిన నేత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు.
● బాపట్లలో మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ పట్ణణ అధ్యక్షుడు కాగిత సుధీర్‌బాబు, పార్టీ మండల అధ్యక్షులు కోకి రాఘవరెడ్డిల ఆధ్వర్యంలో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్‌చేశారు. ఏరియా వైద్యశాలలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పార్టీ దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని చీలురోడ్డు సెంటర్‌లో కేక్ కట్ చేసి రిక్షా కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారప్రతినిధి గవిని కృష్ణమూర్తి, జిల్లా ప్రచార కార్యదర్శి వడ్డిముక్కల డేవిడ్, పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు జోగిరాజా, పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
● వైఎస్సార్ సీపీ చీరాల నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్ ఆదేశాల మేరకు పట్టణంలోని గడియారస్తంభం సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుక నిర్వహించారు. కేక్ కట్‌చేశారు. ఏరియా వైద్యశాలలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పట్టణంలో భారీగా ర్యాలీ నిర్వహించి నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జయసన్, రూరల్ పార్టీ అధ్యక్షులు అంకాల్‌రెడ్డి పాల్గొన్నారు.
వైభవంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు కేక్ కటింగ్స్, క్షీరాభిషేకాలతోపాటు సేవా కర్యాక్రమాలు
Comments
Please login to add a commentAdd a comment