ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధ్యం
బల్లికురవ: రెండు నెలలు కష్టపడటంతోపాటు ఇష్టపడి చదివితే మంచి ఫలితాలతో జిల్లా రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందవచ్చని రాష్ట్ర ఇంటర్ బోర్డు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (సీవోఈ) ఉమ్మడి గుంటూరు ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఆర్జేడీ వీవీ సుబ్బారావు అన్నారు. శనివారం సాయంత్రం బల్లికురవలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఎంవీ ఫౌండేషన్ నెదర్లాండ్ టీమ్ రూ.4.5 లక్షలతో అందజేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను సుబ్బారావు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ గతేడాదిలో బల్లికురవ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించటంపై ప్రిన్సిపాల్ ఎం అనిల్‌కుమార్ అధ్యాపకులను ప్రత్యేకంగా అభినందించారు. ఎంవీ ఫౌండేషన్ కళాశాలకు ఐదేళ్లుగా విద్యాభివృద్ధికి చేయూతనిస్తూ, 10 కంప్యూటర్‌లతో ల్యాబ్‌ను అందంగా తీర్చిదిద్దడంపై ఫౌండేషన్ రాష్ట్ర కోర్డినేటర్ భాస్కర్‌రెడ్డి, మండల కో ఆర్డినేటర్ పీ హరిహరరెడ్డిని అభినందించారు. కంప్యూటర్ ల్యాబ్‌తో ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే ప్రాక్టికల్స్‌కు మార్చిలో జరిగే ఫైనల్ పరీక్షలకు బల్లికురవ కళాశాలలో పరీక్ష కేంద్రం మంజూరు చేయాలని అభ్యర్థించారని, ఇది పరిశీలనలో ఉందని సీవోఈ వెల్లడించారు. ఈ పరీక్ష కేంద్రంలో బల్లికురవ కళాశాలతోపాటు కేజిబీవీ, వలపర్ల ఉన్నత పాఠశాలోని ప్లస్ టూ, ఎంఎస్‌ఆర్ కళాశాల విద్యార్థులను ఇక్కడికి కేటాయిస్తామని చెప్పారు. ఉదయం సాయంత్రం స్డడీ అవర్లతో పాటు, విద్యలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్ధులను తీర్చిదిద్దాలని అధ్యాపకులను ఆదేశించారు.
మానవ మనుగడకు
చెట్ల అవసరం..
మానవ మనుగడకు పచ్చని చెట్లు ఎంతో దోహదపడతాయని, సువిశాలమైన క్రీడా మైదానం ఉన్నందున ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి పోషించాలన్నారు. అనంతరం ఆయన పాఠశాల ఆవరణలో మొక్క నాటి నీరుపోశారు. కార్యక్రమాల్లో డీఐఈవో యర్రయ్య, ప్రిన్సిపల్ ఎం అరుణ్ కుమార్, అధ్యాపకులు ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment