● వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. తొలుత అద్దంకి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కేక్ కట్‌చేసి స్వీట్లు పంచిపెట్టారు. పట్టణంలోని పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
● వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అమర్తలూరు మండలం, మూల్పూరు, యడవూరు, కొల్లూరు మండల కేంద్రంలో కేక్ కట్‌చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
● వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవురి గణేష్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. చెరుకుపల్లిలో కేక్ కట్ చేసి వెయ్యి మందికి అన్నదానం, 100 మందితో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రేపల్లె మండలంలోని పలు గ్రామాల్లో, నగరం మండల కేంద్రంలో కేక్ కట్‌చేసి అభిమానులకు సీట్లు పంపిణీ చేశారు. రేపల్లె పట్టణంలోని ఇసుకపల్లి నుంచి ప్రభుత్వ వైద్యశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బస్టాండ్ సెంటర్లో భారీ కేక్ కట్ చేశారు. ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.
పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ ఆధ్వర్యంలో జరిగాయి. పర్చూరు బొమ్మల సెంటర్‌లో కేక్ కట్‌చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఇంకొల్లు మండలంలో కన్వీనర్ బండారు ప్రభాకరరావు, చినగంజాంలో పార్టీ కన్వీనర్ మున్నం నాగేశ్వరరెడ్డి, యద్దనపూడి మండలంలో ఎంపీపీ పులగం రజని, మార్టూరు మండలంలో కన్వీనర్ పఠాన్ కాలేషావలిల ఆధ్వర్యంలో జగన్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment