ప్రకాశం జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓగా వెంకటేశ్వర్లు
బాపట్లటౌన్: బాపట్ల జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ తెలగతోటి వెంకటేశ్వర్లు పదోన్నతిపై ప్రకాశం జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
కొండచిలువ కలకలం
మేదరమెట్ల: కొరిశపాడు మండలం మేదరమెట్ల పైలాన్ సమీపంలో శుక్రవారం రాత్రి భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. కొండ సమీపంలో నుంచి వచ్చిన కొండచిలువ సుమారు 8.1/2 అడుగుల పొడవున ఉంది. స్థానికులు దీన్ని గుర్తించి చాకచక్యంగా పట్టుకొని అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. అక్కడకు చేరుకున్న అధికారులు కొండచిలువను తీసుకుపోయారు. ఘటన జరిగిన స్థలానికి మేదరమెట్ల ఎస్‌ఐ రఫీ వచ్చి పరిశీలించారు.
సబ్‌జైలు సందర్శన
సత్తెనపల్లి: సత్తెనపల్లి సబ్ జైలును గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార కమిటీ చైర్మన్ పార్థసారథి, గుంటూరు జిల్లా కార్యదర్శి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) లీలావతి శనివారం సందర్శించారు. సబ్ జైలులోని నిందితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశీలించారు. సరుకుల నాణ్యతను, ఆహార పదార్థాలను పరిశీలించారు. కార్యక్రమంలో సత్తెనపల్లి రెండో అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) మహమ్మద్ గౌస్, ప్యానల్ న్యాయవాది బి.ఎల్ కోటేశ్వరరావు, పారా లీగల్ వలంటీర్ షేక్ సుభాని, సబ్‌జైలు సూపరింటెండెంట్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల): కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద శనివారం 1616 క్యూసెక్కుల విడుదల చేశారు. బ్యాంక్ కెనాల్‌కు 68, తూర్పు కెనాల్‌కు 63, పశ్చిమ కెనాల్‌కు 56, నిజాంపట్నం కాలువకు 151, కొమ్మమూరు కాలువకు 1310 క్యూసెక్కులు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment