మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు
బాపట్ల టౌన్: మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం అవస్థలు పెడుతోందని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు విమర్శించారు. పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆదివారం మున్సిపల్ కార్మికులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపాల్టీలో కీలకమైన విభాగంలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. 2011 వరకు పారిశుద్ధ్య కార్మికులతో పాటు వీరికి వేతనాలు పెరిగాయని, ఇప్పుడు ఇంజినీరింగ్ కార్మికులకు ప్రత్యేకమైన వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, పార్కులు, అండర్ గ్రౌండ్ విభాగాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు ఐటీఐ, డిగ్రీలు చదువుకొని పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వీరికి అనేకచోట్ల రూ. 12 నుంచి రూ. 15 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. జీవో నంబర్ 36 ప్రకారం వేత్తనాలు చెల్లించాలని ఆయన కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో ‘చలో విజయవాడ’కు పిలుపు ఇస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్. మజుందార్, సీఐటీయూ నాయకులు కె. శరత్ ,శామ్యూల్‌తో పాటు జిల్లాలోని బాపట్ల, చీరాల, అద్దంకి ,రేపల్లె మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment