రాణించిన ఉత్తరాఖండ్ బ్యాట్స్‌మెన్
మంగళగిరి: అమరావతి టౌన్‌షిప్‌లో కల ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో విజయ్ మర్చంట్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆదివారం కర్నాటక, ఉత్తరాఖండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ జట్టు 90 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 288 పరుగులు సాధించింది. టాస్ గెలిచిన కర్నాటక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేపట్టిన ఉత్తరాఖండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఉత్తరాఖండ్ బ్యాట్స్‌మెన్ మయాంక్ ముద్లి 104 పరుగులు, అనయ నేగి 90 పరుగులు, ఆదిత్య నౌత్వాల్ 61 పరుగులు సాధించారు. కర్నాటక బౌలర్లు గగన్ సాయి, వెంకటేష్, ప్రీతన్‌రాజ్‌లు తలో వికెట్ తీశారు.
యూటీఎఫ్ స్వర్ణోత్సవాలను విజయవంతం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: జనవరి 5, 6, 7, 8వ తేదీల్లో కాకినాడలో నిర్వహించనున్న యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయాలని సంఘ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమకుమారి పేర్కొన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 5, 6వ తేదీల్లో జరిగే బహిరంగ చర్చల్లో ఉపాధ్యాయులు పాల్గొనవచ్చునని చెప్పారు. 7,8వ తేదీల్లో అతిథులు, ముఖ్యులకే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం. హనుమంతరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యారంగం – సవాళ్లు అనే అంశంతోపాటు భవిష్యత్తు అవసరాలు – విద్యా విధానాలు తదితర అంశాలపై లోతైన చర్చ ఉంటుందని తెలిపారు. ప్రజా ప్రతినిధులతో పాటు నిపుణులు, మేధావులు పాల్గొంటారని వివరించారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు. రాజశేఖర్‌రావు, ఎం. కళాధర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని శాఖల బాధ్యులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో జిల్లా సహాధ్యక్షులు జి. వెంకటేశ్వర్లు, వై. నాగమణి, జిల్లా కోశాధికారి ఎండీ దౌలా, కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, కె. సాంబశివరావు, జి.వెంకటేశ్వరరావు, టి. ఆంజనేయులు, ఎండీ షకీలాబేగం, కె. రంగారావు, బి. ప్రసాద్, కె. కేదార్నాథ్, కె. కామాక్షి, ఆడిట్ కమిటీ ప్రతినిధులు అడవి శ్రీనివాసరావు, ఎం. కోటిరెడ్డి, కె. ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బిషప్ సత్యకిరణ్‌కు చోటు
సత్తెనపల్లి: సత్తెనపల్లికి చెందిన బిషప్ ముక్తిపూడి సత్యకిరణ్‌కు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయంలో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం వైభవంగా తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. సంస్థ నేషనల్ చైర్మన్ యు.వి.రత్నం ఆధ్వర్యంలో వివిధ ప్రముఖులకు, సాహిత్య సేవకులకు అవార్డుల ప్రదానం, సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. బిషప్ ముక్తిపూడి సత్య కిరణ్ సాహిత్యంలో కనబరిచిన ప్రతిభకు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం కల్పించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ బాధ్యులు, కళాకారులు, అభిమానులు డాక్టర్ పెద్దిటి జోసెఫ్, నన్నెపాగ ప్రశాంతి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment