పర్చూరు సమన్వయకర్తగా గాదె మధుసూదన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి,బాపట్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్తగా గాదె మధుసూదన్‌రెడ్డిని నియమించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తనయుడు గాదె మధుసూదన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. గత ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గ అబ్జర్వర్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా మధుసూదన్‌రెడ్డిని పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రేంజ్‌లో 63 మంది సీఐలకు డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి
నగరంపాలెం: గుంటూరు రేంజ్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీఐలకు డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు జాబితాను సిద్ధం చేశారు. వారం రోజుల కిందట ఈ జాబితాను సిద్ధం చేయగా, 63 మంది సీఐలు ఉద్యోగోన్నతి జాబితాలో ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐలు కె.వేమారెడ్డి, బెల్లం శ్రీనివాసరావు, ఎస్‌వి.రాజశేఖర్‌రెడ్డి, ఎస్.శ్రీనివాసులరెడ్డి, డివి.చౌదరి, ఎన్.శ్రీకాంత్‌బాబు, ఎస్.అంటోనిరాజు, ఎం.లక్ష్మణ్, బత్తుల శ్రీనివాసరావు, ఐ.శ్రీనివా సన్, బి.రమేష్‌బాబు, ఎ.అశోక్‌కుమార్, కొంకా శ్రీనివాసరావు, ఏవీ.రమణ, ఎం.హైమారావు, షేక్. కరిముల్లాషావలి, యూవీ.శోభన్‌బాబుతోపాటు పలువురు డీఎస్పీలుగా ఉద్యోగోన్నతిలో ఉన్నారు.
కొత్త సంవత్సరానికి
విద్యార్థుల స్వాగతం
ఇంకొల్లు (చినగంజాం): కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు విద్యార్థులు. ఇడుపులపాడు విద్యాపరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం పిడవర్తి పేరిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ థీమ్ నిర్వహించారు. 2025 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి (యూఎన్) అంతర్జాతీయ సహకార సంవత్సరం (ఐవైఎఫ్) (ఇంటర్ నేషనల్ ఆఫ్ కో ఆపరేటివ్స్– 2025) గా ప్రకటించింది. విద్యార్థులు 2025 సంవత్సరం థీంతో ‘సహకారాలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి’.. అనే దృక్పథంతో మానవహారంతో విద్యార్థుల ప్రదర్శించారు. ఐక్యరాజ్యసమితి (యూఎన్) జనరల్ అసెంబ్లీ జూన్ 2025 స్వాగతం పలుకుతూ ఐక్యరాజ్యసమితి థీమ్‌ను ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
జాతీయ ఖోఖో పోటీలకు
రాష్ట్ర జట్టు ఎంపిక
జే.పంగులూరు: జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర జట్టును ఎంపిక చేశారు. మండల పరిధిలోని పంగులూరు స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలో ఎస్‌ఆర్‌ఆర్ ఖోఖో అకాడమీ వారి ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర ఖోఖో పురుషుల జట్టు ఎంపిక జరిగింది. ఈఎంపికలో 13 జిల్లాల నుంచి సుమారు 37 మంది ప్రతిభ గల క్రీడాకారులు పాల్గొన్నట్లు రాష్ట్ర ఖోఖో కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి తెలిపారు. వారిలో అత్యున్నత ప్రతిభ గల క్రీడాకారులను రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ తరపున పరిశీలకుడు నెల్లూరు డీఎస్‌డీఓ ఆర్కే యతిరాజు, ప్రకాశం జిల్లా ఖోఖో కోచ్ డీఎల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి బి కాశీవిశ్వనాథ్‌రెడ్డి, గుంటూరు జిల్లా ట్రెజరర్ ఎం వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా ఖోఖో అసోసియేషన్ ట్రెజరర్ కె హనుమంతరావు, రైల్వే జాతీయ క్రీడాకారుడు కె శ్రీనివాసరావు పాల్గొని జట్టుకి 25 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరికి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పంగులూరు ఎస్‌ఆర్‌ఆర్ ఖోఖో అకాడమీలో 25 రోజుల పాటు శిక్షణ జరగన్నుట్లు పీడీ మేకల సీతారామిరెడ్డి తెలిపారు. అనంతరం జట్టు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో జరిగే 28వ జాతీయ క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. క్యాంప్ 25 రోజులపాటు గ్రామస్తులు సహకారంతో చైర్మన్ బాచిన చెంచుగరటయ్య ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment