● ప్రతి ఒక్కరూ హెల్మెట్
తప్పనిసరిగా వాడాలి
● వార్షిక నేర నివేదికను
వివరించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడీ
బాపట్లటౌన్: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ వార్షిక నేర నివేదికను వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలపై జిల్లాలోని ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నామన్నారు. హెల్మెట్ వాడకపోవడం వలన కలిగే నష్టాలపై పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు, డ్రగ్స్ సేవిస్తే కలిగే అనర్ధాలపై కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. పల్లె నిద్ర కార్యక్రమాల ద్వారా ప్రజలకు పోలీస్‌సేవలు విస్తృతం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 3637 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తం కేసుల్లో జిల్లాలోని ప్రజలు 37.84 లక్షలు సొత్తు కోల్పోయారు. వాటిల్లో 21.60 లక్షల సొత్తు రికవరీ చేసినట్లు తెలిపారు. మహిళలపై దాడికేసులు జిల్లాలో 531 కేసులు నమోదయ్యాయన్నారు. జిల్లాలో 211 యాక్సిడెంట్ కేసులు నమోదు కాగా వాటిల్లో 234 మంది మృతి చెందారన్నారు. వాటిల్లో 425 మందికి గాయాలయన్నారు. జిల్లాలో సైబర్ మోసాల కారణంగా 90 కేసులకు గానూ రూ. 57.02 లక్షలు కొల్పొగా వాటిల్లో 17.11 లక్షల సొత్తు రికవరీ చేసినట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని 12,807 మందిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేయటం జరిగిందన్నారు. జిల్లాలో ఈ ఏడాది నలుగురిపై పీడీ చట్టాలను ప్రయోగించడం జరిగిందన్నారు. వారిలో ఒకరిని జిల్లా బహిష్కరణ చేశామన్నారు. ఈ ఏడాది 55 సార్లు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించామన్నారు. నేరాల నియంత్రణకు జిల్లాలో 817 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశామన్నారు. కార్తీకపౌర్ణమిను పురస్కరించుకొని తీరానికి లక్షలాది పర్యాటకులు వచ్చినప్పుడు డ్రోన్‌తో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు నిర్వహించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment