సర్వేను అడ్డుకుంటున్న అటవీ అధికారులు
అశ్వాపురం: మండలంలోని మల్లెలమడుగులో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. గ్రామంలో కొన్ని రోజులుగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతోంది. గ్రామంలోని కొన్ని ఇళ్లు రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్నాయని సర్వే చేపట్టొద్దని ఫారెస్ట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మల్లెలమడుగులో 40 ఏళ్లుగా స్థానికులు నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇంటి పన్నులు చెల్లిస్తున్నారు. ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులతో వందల కుటుంబాలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు తాతలు, తండ్రుల కాలం నుంచి 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నా ఫారెస్ట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని మల్లెలమడుగులో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమకు ఫారెస్ట్ అధికారులతో మాట్లాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment