పెద్దమ్మతల్లి ఆలయంలో రుద్రహోమం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం అమ్మవారికి విశేష పూజలు, రుద్రహోమం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని యాగశాలలో రుద్రహోమం, పంచామృతాభిషేకం జరిపారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతిపూజల అనంతరం రుద్రహోమం చేశారు. చివరన పూర్హాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రుద్రహోమం పూజలో పాల్గొన్న ఏడుగురు దంపతులకు అర్చకులు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు. కొత్తగూడెం సొసైటీ వైస్ ప్రెసిడెంట్ కుచుపూడి జగన్, మయూరి దంపతులు, భక్తులు పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు
మంజూరు చేయాలి
ఖమ్మం సహకారనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ జీపీఎఫ్, మెడికల్ బిల్లులను మంజూరు చేయాలని, ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుల పెన్షనరీ బెనిఫిట్స్‌ను తక్షణమే విడుదల చేయాలని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సమ్మె చేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment