కొత్తగూడెంటౌన్: ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసుల సర్వీసును గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉత్తమ, మహోన్నత, కఠిన సేవా పతకాలను ప్రకటించింది. జిల్లాలో 48 మంది పోలీసులు ఈ పతకాలకు ఎంపికయ్యారు. మహోన్నత సేవా పతకాలు సాధించిన వారిలో ఆరో బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాద్‌రెడ్డితో పాటు మరో నలుగురు ఉన్నారు. ఆర్‌ఎస్సైలు కె. జగన్మోహనాచారి, షేక్ హుస్సేన్, సీహెచ్.హరీష్, ఎ.ఏకాంబరం, వి, రామారావు, బి,కిశోర్‌రెడ్డి, బి. హనుమంతరావు, కానిస్టేబుళ్లు జి.భరత్‌కుమార్(దుమ్ముగూడెం), బి.మహేష్‌కుమార్(గుండాల), ఎన్.నరేష్(టేకులపల్లి), బి.మోహన్(మణుగూరు), ఏఆర్ కానిస్టేబుల్ బి.దేవేంద్ర కఠిన సేవా పతకాలు సాధించారు. ఇక ఎస్సై జి.శ్రీనివాసులు, బోడు ఏఎస్సై ఎస్‌కే మహ్మద్‌కు సేవా పతకాలు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment