కొత్తగూడెంఅర్బన్ : ఈనెల 7 నుంచి 9 వరకు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగే రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫేర్, ఇన్‌స్పైర్ పోటీలకు ఎంపికై న విద్యార్థులకు స్థానిక సింగరేణి ఉన్నత పాఠశాలలో ఈనెల 3న అవగాహన సదస్సు నిర్వహిస్తామని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి, సైన్స్ అధికారి ఎస్.చలపతిరాజు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత నవంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు అన్నపురెడ్డిపల్లిలో జరిగిన జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్, ఇన్‌స్పైర్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన విద్యార్థులు మాత్రమే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హులని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ మనాక్ పోటీలకు ఎంపికై న వారు పూర్తిస్థాయి ప్రాజెక్ట్ రిపోర్ట్ పెన్‌డ్రైవ్‌తో పాటు మూడు ఆబ్‌స్ట్రాట్ కాపీలు, బోనఫైడ్ సర్టిఫికెట్, రెండు ఫొటోలు తీసుకుని రావాలని సూచించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న వారి వివరాలను హెచ్‌ఎంలు, ఎంఈఓల గ్రూప్‌ల్లో పోస్ట్ చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment