ఎంసీహెచ్‌లో మొక్కలు నాటాలి
సింగరేణి(కొత్తగూడెం): రామవరంలోని మాతా శిశు ఆస్పత్రిలో భారీగా మొక్కలు నాటాలని, ఆస్పత్రి ఆవరణను సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఎంసీహెచ్ ఆవరణలో ఖాళీగా ఉన్న 1.5ఎకరాల స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఆ స్థలంలో ఔషధ, సుందరీకరణ మొక్కలు నాటాలని సూచించారు. మాతా శిశు కేంద్రానికి వచ్చే వారికి నీడనిచ్చేలా చూడాలని, ఆవరణలో వర్షపు నీరు నిల్వకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజన్‌స్వామి, డీఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా ప్రజలకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందేలా కృషి చేస్తామని, జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా మరో ప్రకటనలో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్
Comments
Please login to add a commentAdd a comment