కేసులు నమోదు | - | Sakshi
Sakshi News home page

కేసులు నమోదు

Published Sun, Jan 19 2025 12:36 AM | Last Updated on Sun, Jan 19 2025 12:36 AM

కేసుల

కేసులు నమోదు

ఇల్లెందు: పురుగులమందు తాగిన పట్టణంలోని స్ట్రట్‌ఫిట్‌బస్తీకి చెందిన వ్యక్తి ఆస్పత్రిలో మృతిచెందగా.. శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. స్ట్రట్‌ఫిట్‌బస్తీకి చెందిన ఇర్ప రాంబాబు (49)ను తీవ్ర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో జీవితం మీద విరక్తి చెందిన ఆయన రెండు రోజుల కిందట పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు కొత్తగూడెంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య సుశీల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సందీప్‌ శనివారం కేసు నమోదు చేశారు.

దూషించిన వ్యక్తిపై...

మండలంలోని ముకుందాపురానికి చెందిన ఎండీ సలీంను అదే గ్రామానికి చెందిన గొగ్గెల రామకృష్ణ దూర్భాషలాడాడు. సలీం ఫిర్యాదతో విచారణ చేసిన సీఐ బత్తుల సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వ్యక్తిపై దాడి

భద్రాచలంఅర్బన్‌: పట్టణంలోని ఏఎంసీకాలనీకి చెందిన అల్లాడి జయరాజ్‌పై శనివారం సాయంత్రం చర్ల రోడ్డులో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. జయరాజ్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడికి సంబంధించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో జయరాజ్‌ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. ఎస్‌ఐ పీవీఎన్‌ రావు కేసు నమోదు చేశారు.

ఇసుక ట్రాక్టర్‌ సీజ్‌

ములకలపల్లి: ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను రెవెన్యూ అధికారులు శుక్రవారం సీజ్‌ చేశారు. మండలంలోని మూకమామిడి శివారులోని వాగు నుంచి ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందగా దాడి చేసి, ఇసుక తోలుతున్న ట్రాక్టర్‌ సీజ్‌ చేసి, తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించామని గిర్దావర్‌–2 భద్రు తెలిపారు.

ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మృతి

ఖమ్మంస్పోర్ట్స్‌: ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సంఘం కోశాధికారి కేఈ సెల్యూకాస్‌ (45) గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్‌లో ఆయన నివాసంలో శనివారం గుండెనొప్పి రాగా కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. సెల్యూకాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన స్వస్థలం పాల్వంచ కాగా కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ బ్యాటరీలు, ఇన్వర్టర్ల ఫ్యాక్టరీలు నిర్వహిస్తున్నారు. స్వతహాగా ఫుట్‌బాల్‌ క్రీడాకారుడైన సెల్యూకాస్‌ దశాబ్ద కాలంగా జిల్లాలో అసోసియేషన్‌ అభివృద్ధికి కృషి చేస్తూ క్రీడాకారులకు చేయూతనిస్తున్నారు. ఆయన మృతిపై డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పుట్టా శంకరయ్య, కె.ఆదర్శ్‌కుమార్‌, కె.క్రిస్టోఫర్‌బాబు, రఘునందన్‌, షఫీ, ఉప్పల్‌రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు.

గుంతలో పడి వ్యక్తి...

పినపాక: మద్యం మత్తులో ఎర్రగుంట అడవిలోని గుంతలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పగిడేరు గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పగిడేరు గ్రామానికి చెందిన కుంజా నరేశ్‌ (35) గత నెలలో మద్యం మత్తులో ఎర్రగుంట అడవిలోకి వెళ్లాడు. మద్యం మత్తులో గుంతలో పడిపోయాడు. శనివారం ఉదయం అడవిలోకి వెళ్లిన కొందరు నరేశ్‌ మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతున్న వ్యక్తి...

లోన్‌యాప్‌ వేధింపులు తాళలేక ఆత్మహత్య?

ఇల్లెందు: పట్టణంలోని నంబర్‌–2 బస్తీ 4వ వార్డుకు చెందిన సంతోష్‌లోధ్‌ పురుగులమందు తాగి ఖమ్మంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. సంతోష్‌లోధ్‌ లోన్‌ యాప్‌లో రూ.90 వేల వరకు రుణం పొందారు. కొంతకాలం వరకు సక్రమంగా చెల్లించాడు. సుమారు రూ.40 వేలు చెల్లించిన తర్వాత అనారోగ్యం బారిన పడి రుణం చెల్లించలేదు. దీంతో లోన్‌ యాప్‌ ఏజెంట్లు దూషిస్తూ బెదిరించటం మొదలుపెట్టారు. ఫోన్‌ ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారు. లోన్‌ చెల్లించకపోతే కుటుంబ సభ్యుల ఫొటోలు మార్ఫింగ్‌ చేసి అందరికీ పంపిస్తామని బెదిరించటంతో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మం వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంతోష్‌లోధ్‌ మృతిచెందాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
కేసులు నమోదు 1
1/1

కేసులు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement