క్రీడాకారులు ప్రతిభతో ఎదగాలి
పాల్వంచరూరల్: క్రీడాకారులు చదువుతోపాటు క్రీడల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆకాంక్షించారు. మండలంలోని లక్ష్మీదేవిపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలల స్పోర్ట్స్ మీట్‌లో ముల్కలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రథమస్థానంలో నిలిచారు. పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ద్వితీయస్థానం కై వసం చేసుకున్నారు. ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే విజేతలకు బహుమతులు అందించి ప్రసంగించారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హెచ్.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ వివేక్, కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గంగిరెడ్డి యుగంధర్‌రెడ్డితోపాటు పి.శంకర్, ఎన్.శేషుబాబు, కె.రమేశ్, వి.నర్సింహకుమార్, ఎస్‌కే సాబిర్‌పాషా, ముత్యాల విశ్వనాథం, అడుసుమల్లి సాయిబాబు, విసంశెట్టి పూర్ణచందర్‌రావు, ముత్యాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment