‘డబుల్’ ఇళ్లు ఖాళీ చేయించిన అధికారులు
దమ్మపేట: మండలంలోని మల్లారం గ్రామ శివారులో అసంపూర్తి డబుల్ బెడ్రూంలను ఆవాసాలుగా మార్చుకున్న పేదలను డీటీ వాణి.. పోలీసుల సాయంతో ఖాళీ చేయించారు. మల్లారం శివారులో పునాదిపై పిల్లర్లు మాత్రమే నిర్మించి, అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూంలను సుమారు 40 మంది పరిసర ప్రాంత పేదలు ఆక్రమంచుకున్నారు. నివా స యోగ్యంగా మార్చుకున్న విషయం విదితమే. శనివారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీటీ నివాసాల వద్దకు చేరుకుని, ఖాళీ చేయాలని సూచించారు. ఎలాంటి నివాసం లేని, నిరుపేదలమైన తాము ఖాళీ చేయలేమని గట్టిగా బదులిచ్చారు. దీంతో ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి, బలవంతంగా ఖాళీ చేయించా రు. ఓ ఇద్దరు డీజిల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళన చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఆక్రమణదారులను పోలీస్ స్టేషన్‌కు తరలించే క్రమంలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోగా, వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
స్వల్ప ఉద్రిక్తత.. పోలీసులతో వాగ్వాదం
Comments
Please login to add a commentAdd a comment