పాల్వంచ: ప్రజల అమాయకత్వాన్ని, అవసరాలను ఆసరా చేసుకుని కొందరు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతూ సులువుగా డబ్బు దోచేస్తున్నారు. తాజాగా పాల్వంచలో ఓ సైబర్ నేరగాడు చాకచక్యంగా నగదు దోచేస్తుండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వెడ్డింగ్ ప్లాట్‌ఫామ్ ఆర్గనైజర్స్‌ను టార్గెట్ చేసుకుని సుమారు పది మంది వద్ద చోరీకి పాల్పడటం చర్చనీయాంశమైంది. పాల్వంచలోని ఓ పెద్ద ఫంక్షన్‌హాల్‌లో త్వరలోనే తన కూతురి వివాహం ఘనంగా చేస్తున్నానని, ముందు పెద్దమ్మగుడి వద్ద ఫంక్షన్ హాల్‌లో ఎంగేజ్‌మెంట్ ఉందని, ఫొటోగ్రఫీ, డెకరేషన్, క్యాటరింగ్ కోసం బేరసారాలు ఆడి నమ్మించాడు. అందుకు వచ్చి అడ్వాన్స్‌లు తీసుకెళ్లాలని చెప్పాడు. కొంత సమయం తర్వాత మళ్లీ ఫోన్ చేసి తన ఖాతాలో లిమిట్ అయిపోయిందని, అర్జంట్‌గా వేరే ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలని, ఇంటికి వచ్చాక వివాహ వేడుకకు సంబంధించిన అడ్వాన్స్‌తో పాటు ఈ డబ్బులు ఇస్తానని నమ్మించాడు. దీంతో ఈవెంట్ కోసం ఆశపడిన సుమారు పది మంది రూ.2,500 నుంచి రూ.6 వేల వరకు డబ్బులు కొట్టారు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. కేటుగాడి ఉచ్చులో పడి మోసపోవడం తమ వంతైందని బాధితులు తలలు పట్టుకుంటున్నారు.
ట్రావె ల్స్ నిర్వాహకుడికి..
ఇదిలా ఉండగా ఇటీవల బీసీఎంరోడ్‌లోని ట్రావెల్స్ నిర్వాహకుడికి ఫోన్ చేసి తాను రెడ్డీస్ హాస్పిటల్‌లో ఉన్నామని, అర్జెంట్‌గా ఆస్పత్రిలో డబ్బులు వేయాలని, నగదును వ్యక్తి వచ్చి ఇస్తాడని, డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినందుకు పదిశాతం కమీషన్ కట్ చేసుకోమని నమ్మబలికాడు. దీంతో అతను ఎదురుగా వ్యక్తి వచ్చి ఉండటంతో వెంటనే ఖాతాకు రూ.90 వేలు నగదు ఫోన్‌పే చేశాడు. ఎదుట వ్యక్తిని డబ్బులు ఇవ్వమని చెప్పగా తనకే మీరు రూ.9 వేలు బిర్యాని బిల్లు ఇస్తారని అడ్రస్ చెప్పడంతో వచ్చానని చెప్పడంతో ఇద్దరు మోసపోయినట్లు గుర్తించారు. దీంతో రూ.90 వేలు బదిలీ చేసిన వ్యక్తి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాల్వంచలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పలువురు..
Comments
Please login to add a commentAdd a comment