విద్యార్థుల భవిష్యత్‌కు చేయూత
భద్రాచలం: గిరిజన విద్యార్థుల భవిష్యత్‌కు చేయూతనిచ్చేలా అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. శనివారం భద్రాచలం పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలుర, బాలికల ఆశ్రమ పాఠశాలలు, గ్రంథాలయాన్ని సందర్శించారు. డైనింగ్ హాల్, డార్మెటరీ, గ్రంథాలయంలో రీడింగ్ హాల్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్ కాలనీలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని సందర్శించారు. వివిధ రకాల పండ్ల మొక్కలు, మునగ, వెదురు మొక్కల పెంపకం చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. అధికారులు అశోక్ కుమార్, హరీష్, శ్రీనివాస్, శ్రీనివాస్, అపర్ణ, వెంకటేశ్వరాచారి, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తులు ఆహ్వానం
ఏకలవ్య మోడల్ గిరిజన విద్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో స్టూడెంట్ కౌన్సిలర్‌గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీఓ బి.రాహుల్ శనివారం ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెంది, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఐటీడీఏలోని ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. వివరాలకు 97041 78525 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. చర్ల, దుమ్ముగూడెం, టేకులపల్లి, సింగరేణి ఏకలవ్య పాఠశాలల్లో నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఆకట్టుకునేలా విద్యుద్దీకరణ చేయాలి
భద్రాచలంటౌన్: మ్యూజియం ఆకట్టుకునేలా విద్యుద్దీకరణ చేయాలని, సెల్ఫీలు దిగే చోట తప్పనిసరిగా ఫోకస్ లైట్లు అమర్చాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. శనివారం ఆయన ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను సందర్శించారు. మల్టీ కలర్ లైట్లు ఏర్పాటు చేయాలని, పిల్లల క్రీడల పరికరాలు అమర్చాలని పేర్కొన్నారు. రమణయ్య, అశోక్ కుమార్, హరీష్, హరికృష్ణ, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment