‘వన విహారం’లో రాపత్తు సేవ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో వైకుంఠ ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు సేవలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఏపీలోని పురుషోత్తపట్నం గ్రామంలోని దేవస్థానం భూముల్లో ఉన్న వన విహార మండపంలో రాపత్తు సేవ జరిపారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి, భరత నాట్యంలు అలరించాయి. కాగా రామాలయ బేడా మండపంలో స్వామివారి నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, హరిశ్చంద్ర నాయక్, రామిరెడ్డి పాల్గొన్నారు.
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
భద్రాచలంటౌన్: రామాలయంలో శాశ్వత నిత్యాన్నదానానికి ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకుటూరు గ్రామానికి చెందిన పులగం రామకృష్ణారెడ్డి దంపతులు రూ.లక్ష విరాళం అందించారు. స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.
సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్‌కు దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెంటౌన్: రాష్ట్రస్థాయిలో జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్‌కు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి పి. పరంధామరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభు త్వ కార్యాలయాల్లో వివిధ శాఖల్లో పని చేస్తు న్న ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 23, 24 తేదీల్లో హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో క్రికెట్, అథ్లెటిక్స్, హాకీ, ఎల్‌బీ ఇండోర్ స్టేడియంలో చెస్, క్యారమ్స్, పవర్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, స్విమ్మింగ్, ఖోఖో, యోగా పోటీలను జరుగుతాయని వివరించారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో వాలీబాల్ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 20 తేదీ లోపు హెచ్‌ఓడీ అధికారి అనుమతితో ఐడీ కార్డు, బయోడేటా ఫామ్‌ను జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు.
ఉచిత శిక్షణకు..
కొత్తగూడెంరూరల్: ఆర్‌ఆర్‌బీ, స్టాఫ్ సెలక్షన్స్, బ్యాంకింగ్, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలకు నాలుగు నెలలపాటు బేసిక్ ఫౌండేషన్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కె.సంజీవరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన మైనార్టీ అభ్యర్థులు వచ్చే నెల 15వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9553491432 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
ప్రశాంతంగా
నవోదయ ప్రవేశ పరీక్ష
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో శనివారం నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్షల నిర్వహణకు 8 సెంటర్లు ఏర్పాటు చేయగా, 1,486 మంది విద్యార్థులకు గానూ 1,195 మంది విద్యార్థులు హాజరయ్యారు. 291 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి తెలిపారు. డీఈఓతోపాటు నవోదయ పరీక్షల ఇన్‌చార్జ్ బి.నరేష్, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎస్.మాధవరావు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
‘బ్యాడ్మింటన్’ బ్రోచర్లు ఆవిష్కరణ
సింగరేణి(కొత్తగూడెం): వచ్చే నెల 6 నుంచి 9వ తేదీవరకు కొత్తగూడెంలో నిర్వహించే బ్యాడ్మింటన్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్ బ్రోచర్లను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణంలోని హనుమాన్ బస్తీలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నమెంట్ బాధ్యులు కే.సావిత్రి, కే.రమేష్, రాసపెల్లి రాజేంద్ర ప్రసాద్, శ్రీలక్ష్మి, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
21, 22వ తేదీల్లో
సింగరేణి మెడికల్ బోర్డ్
సింగరేణి(కొత్తగూడెం): ఈ నెల 21,22 తేదీల్లో కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ ఆస్పత్రిలో మెడికల్ బోర్డ్‌ను నిర్వహించనున్నారు. మొదటి రోజు కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, రెండో రోజు రిపోర్టుల ఆధారంగా అనారోగ్య సమస్యలను పరిశీలించి ఇన్‌వాలిడేషన్ చేస్తారు. అన్‌ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు సంస్థలో ఉద్యోగ అవకాశం కల్పించేందుకు యాజమాన్యం 2018 నుంచి మెడికల్ బోర్డులు నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment