మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
టేకులపల్లి: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అందిపుచ్చుకొని స్వశక్తితో కుటీర పరిశ్రమ నెలకొల్పి పదిమందికి ఉపాధి కల్పించడం అభినందనీయమని, మార్కెటింగ్ వెసులుబాటు కల్పించుకొని ఆర్థికంగా ఎదగాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకాంక్షించారు. శుక్రవారం టేకులపల్లిలో నెలకొల్పిన సఖి నాప్కిన్ యూనిట్, శానిటరీ నాప్కిన్ యూనిట్లను మహిళల సమక్షంలో ప్రారంభించి మాట్లాడారు. నిరుద్యోగులైన ఐదుగురు గిరిజన యువతులు రూ.9 లక్షల 90 వేల సబ్సిడీతో రూ.16 లక్షల ఖర్చుతో నిర్మించిన నాప్కిన్ యూనిట్‌తో ఆర్థికంగా బలోపేతమవ్వాలని పేర్కొన్నారు. ఇక్కడ తయారు చేస్తున్న నాప్కిన్లపై గ్రామ, మండల సమాఖ్య సమావేశాల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తామని, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కల్పించే విధంగా చూస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సహాయ జేడీఎం హరికృష్ణ, ఐకేపీ ఏపీఎం రవికుమార్, బాణావత్ పుల్లమ్మ, మాలోత్ కరుణ, గౌస్య, చిట్టెమ్మ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment