అటవీ ఉత్పత్తులతో..
గిరిజన మహిళలు కొండ్రు సుధారాణి, రామలక్ష్మి, అట్టం కమల, సిడియం కమల, వసుంధర, హర్షిణి, విజయ దుర్గా, శీలం దుర్గ ఓం శక్తి మల్టీ ప్రొడక్ట్‌స్ పేరిటి ఓ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఏపీలోని చింతూరులో జరిగే సంతలో ఆదివాసీ సంప్రదాయ పంటలు, ఉత్పత్తులు కొనుగోలు చేసి, బయట ప్రపంచానికి విక్రయిస్తున్నారు. ఇప్పపువ్వు లడ్డూ, ఆనె గింజలు, నువ్వులు, రాగి లడ్డూలు తయారు చేసి విక్రయిస్తున్నారు. తేనె కూడా అమ్ముతున్నారు. అంబలి, కొవ్వొత్తులు, సర్ఫ్ తదితర వస్తువులను కూడా తయారు చేసి విక్రయిస్తున్నారు. మహాబీర గింజలు, తానికాయ, కుంకుడుకాయ తదితర గింజలను అమ్ముతున్నారు. ఆదివాసీ వంటలను భద్రాచలం వచ్చే వీఐపీలకు రుచి చూపిస్తున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడకుండా అందుబాటులో ఉన్న వనరులను ఆదాయ మార్గాలుగా మార్చుకున్నారు. సీఆర్‌పీఎఫ్ వాళ్ల ద్వారా కొవ్వొత్తులు, ఫినాయిల్ తయారీలో తీసుకున్న శిక్షణ స్వయం ఉపాధికి దోహదపడిందని నిర్వాహకురాలు కొండ్రు సుధారాణి తెలిపారు.
మిల్లెట్ బిస్కెట్లు విక్రయిస్తున్న జజ్జర్ల సమ్మక్క
Comments
Please login to add a commentAdd a comment