ఐఎన్‌టీయూసీని గెలిపించుకోవాలి
బూర్గంపాడు: కార్మిక హక్కుల పరిరక్షణ, కార్మికుల సంక్షేమానికి ఐటీసీ పీఎస్‌పీడీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీని గెలిపించుకోవాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య పిలుపునిచ్చారు. సారపాకలో ఐఎన్‌టీయూసీ ఎన్నికల కార్యాలయాన్ని శుక్రవారం వారు ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే భద్రాచలం పేపర్‌బోర్డుకు బీజం పడిందని గుర్తుచేశారు. పరిశ్రమ అభివృద్ధితో పాటుగా కార్మిక సంక్షేమం కోసం ఐఎన్‌టీయూసీ వెన్నుదన్నుగా నిలుస్తున్నందున గెలిపించాలని కోరారు. ఐఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకులు మారం వెంకటేశ్వరరెడ్డి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోనె రామారావు, యారం పిచ్చిరెడ్డి, చెన్నం సూర్యప్రసాద్, బట్టా విజయ్‌గాంధీ, పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, దుగ్గెంపూడి కృష్ణారెడ్డి నాయకులు పాల్గొన్నారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
పాల్వంచరూరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య సూచించారు. పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుకవారం ఆయన 25 కొబ్బరి మొక్కలను నాటి మాట్లాడారు. నాయకులు నాగా సీతారాములు, ప్రిన్సిపాల్ పద్మ, అధ్యాపకులు పాల్గొన్నారు.
మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
కొత్తగూడెంరూరల్: రానున్న రోజుల్లో మతోన్మాద మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపి రాహుల్‌గాంధీని ప్రధానమంత్రి చేస్తే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు. లక్ష్మీదేవిపల్లిలో పార్టీ ముస్లిం మైనార్టీ విభాగం జిల్లా కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్‌ఖాన్‌తో పాటు ధర్మారావు, నాగా సీతారాములు, కంచర్ల చంద్రశేఖర్‌రావు, కొత్వాల శ్రీనివాసరావు, హనుమంతరావు, చింత్రాల రవికుమార్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పాయం, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం
Comments
Please login to add a commentAdd a comment