ఏడాది పాలనకే ప్రభుత్వంపై వ్యతిరేకత
అశ్వాపురం: ఏడాది పాలనకే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. అశ్వాపురంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కందుల కృష్ణార్జున్‌రావు నివాసంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామసభల్లో ప్రజల తిరుగుబాటుతో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు గ్రామాలకు పోలేక వందల మంది పోలీసులతో సభలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి అవి అమలు చేయలేక, మళ్లీ స్థానిక ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు గ్రామసభల్లో కొత్త పథకాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తే గ్రామానికి పదో, ఇరవైయో వస్తాయని, అవి ఆ పార్టీ అనుచరులకే ఇస్తారని ఆరోపించారు. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో పామాయిల్ ఫ్యాక్టరీకి, నవోదయ పాఠశాలకు స్థలం కేటాయిస్తే వాటిని ఇతర ప్రాంతాలకు తరలించారన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, యూత్ మండల అధ్యక్షుడు గద్దల రామకృష్ణ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎన్నా అశోక్‌కుమార్, మాజీ జెడ్పీటీసీ తోకల లత, మాజీ మండల అధ్యక్షుడు కందుల కృష్ణార్జున్‌రావు, నాయకులు జాలె రామకృష్ణారెడ్డి, ఈదర సత్యనారాయణ, సూదిరెడ్డి గోపాలకృష్ణారెడ్డి, తాటి పూజిత, మేడవరపు సుధీర్, నక్కనబోయిన పాపారావు, నాయకులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు
Comments
Please login to add a commentAdd a comment