కేసులను సత్వరమే పరిష్కరించాలి
కొత్తగూడెంటౌన్: కేసులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ రోహిత్‌రాజు ఆదేశించారు. శుక్రవారం చుంచుపల్లి పోలీసు స్టేషన్‌ను, డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్స్ కో ఆర్డినేషన్ సెంటర్‌ను ఆయన సందర్శించారు. చుంచుపల్లి ఠాణా ఆవరణను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సిబ్బందితో మాట్లాడి కేసుల వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్స్ కో ఆర్డినేషన్ సెంటర్‌ను సందర్శించి జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలపై ఆరా తీశారు. సైబర్ నేరాలపట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, సైబర్ సీఐ జితేందర్, ఎస్సైలు రవి, జూబేదాలు పాల్టొన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజు
Comments
Please login to add a commentAdd a comment